Vahini Current Issue : Aug 2026
సంపాదకీయం
వాహిని ప్రియ పాఠక మహాశయులందరికి సంపాదకీయ కార్యవర్గ సభ్యుల ప్రణామములు. శ్రావణ మాసంలో ఆగస్టు వాహిని మాసపత్రిక పాఠకులందరికీ, సవినయ నమస్సులతో, పఠనానికై ఆహ్వానిస్తున్నాము.
అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణం ఒకటి. జులై, ఆగస్టు నెలల మధ్య వర్షాకాలంలో వచ్చే ఈ మాసం.. ముఖ్యంగా శివ భక్తులకు ఎంతో ఇష్టమైనది. ఈ నెల రోజుల సమయంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలకు విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
శివుని త్యాగానికి ప్రతీక శ్రావణ మాసం ప్రాముఖ్యత వెనుక ఒక గొప్ప పురాణ గాథ దాగి ఉంది, అదే "సముద్ర మథనం". అప్పట్లో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు.
మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని సముద్రాన్ని మథించడం ప్రారంభించారు. అయితే, అమృతం పుట్టడానికి ముందే అత్యంత భయంకరమైన "హాలాహలం" (విషం) పుట్టుకొచ్చింది. ఆ విషం ప్రభావానికి లోకమంతా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది.
వాహిని పాఠకులకు సాంకేతిక పరిజ్ఞానం మేళవిస్తూ, ప్రాంతీయ తెలుగుతనాన్ని ప్రోత్సహిస్తూ మేము మీకు అందిస్తున్న ఈ సంచిక మీకు నచ్చుతుందని ఆకాంక్షిస్తున్నాము.
ఈ సంచిక సంపాదకీయంలో మాకు సహకరించి, వాహిని మాసపత్రికకు రచనలు అందచేసిన రచయితలకు, అలాగే ప్రకటన కర్తలకు, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు అందరికి ధన్యవాదాలు. తెలుగు సంస్కృతి, సాహిత్యంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ, వాహిని లో మన తెలుగు వారికి అందించాలనే ఒక తపనతో చేసిన ఈ ప్రయత్నాన్ని సహకరిస్తారని ఆకాంక్షిస్తూ....
మీ శ్రేయోభిలాషులు,
శ్రీనివాస్ గోవర్ధనం